నాడీపతి ప్రాచీన సాంప్రదాయ గిరిజన వైద్య చికిత్సా శిబిరం

నాడీపతి  ప్రాచీన  సాంప్రదాయ  గిరిజన  వైద్య  చికిత్సా శిబిరం
Sub: నాడీపతి పురాతన వైద్య విధాన  సంస్థ ఆధ్వర్యంలో ' మారేడుమిల్లి ' కేంద్రంగా ప్రపంచ రికార్డు సాధన లక్ష్య కార్యక్రమం.

'చెట్టుకో కౌగిలింత' (largest tree hugs) ప్రస్తుత ప్రపంచరికార్డు  1200 మంది. రికార్డ్స్ పుస్తకాల ప్రకారం ఈ రికార్ద్ దక్షిణకొరియా దేశం పేరిట ఉంది. 21 మార్చి 2015 న కొరియా ఫారెస్ట్ సర్వీస్ ఈ రికార్డ్ ని నెలకొలిపింది. ఆ రికార్ద్ బ్రేక్ చెయ్యటమే లక్ష్యంగా ' నాడీపతి '  పురాతన వైద్య విధాన  సంస్థ 9 డిసంబర్ 2015 న నిర్వహిస్తున్న కార్యక్రమానికి మిమ్ము ఆహ్వానించడంతో బాటూ ప్రపంచరికార్డ్ సాధనలో భాగస్వాములు కమ్మని కోరుతున్నాం. 
Date: December 9th 2015.    9am to 3pm

Venue:    మారేడుమిల్లి, వాలి సుగ్రీవా వన మూలికా సంరక్షణా ప్రదేశం నందు,
కాకినాడ Nadipathy Research Foundation వారిచే నాడిపతి వైద్య విధానం, పరిశోధనలో భాగంగా ఒక చికిత్స అయిన వృక్షాలను ఆలింగనం(Tree hug Therapy)మరియు చుట్ట చికిత్స, తేనెటీగ (Bee Venom) చికిత్స, మట్టి చికిత్స, పచ్చని ఆకుల చికిత్స, ఆక్యుపంక్చర్ చికిత్సలను వచ్చే నెల డిసెంబర్ 9 వతేదీన ఉదయం 9. గంటల నుండి మద్యాహ్నం 3 గంటల వరుకు సుమారుగా 6౦౦౦ మంది రోగులతొ నిర్వహించబడును. దీనివల్ల మానవుని శరీరంలో అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్య శక్తిని చెట్లు ప్రసాదిస్తాయి అని నాడిపతి వైద్యలు డా.పి. కృష్ణంరాజుగారు తెలిపారు.

వృక్షచికిత్స వివరణ:
1. వృక్షాల ఆలింగనం వల్ల వృక్షాలలో ఉన్న శక్తిని మానవ శరీరం గ్రహించగలదు.
2. వృక్షాలు శక్తి కేంద్రాలు అందువల్ల ఈ పద్దతి ద్వారా శరీరంలో నొప్పులు, వత్తిడి, తలనొప్పి తగ్గించబడును.
3. పచ్చటి చెట్లును చూచుట వలన కంటి సమస్యలు పోవును.

పల్లె వాసులలో చాలా మందికి కంటి సమస్యలు లేకపోవటానికి కారణం వారు పచ్చటి ప్రకృతిలో నివసించటమె. పూర్వకాలంలో బాటసారులు అలసట చెందినపుడు చెట్లు క్రింద పడుకొనుట, వాటిని హత్తు కొనుట వల్ల వారు తిరిగి శక్తి పొంది మరికొంత దూరం ప్రయాణించేవారు.
ఒక్కొక్క చెట్టును ఆలింగనం చేసుకొనుట వల్ల ఒక్కొక్క వ్యాధి నుంచి ఉపశమనం కలుగును.
మంచి ఫలితములు కొరకు 10 సార్లు గాని 20 నుంచి 30 నిమిషాలు గాని వృక్షాలును ఆలింగనము చేసుకోవలెను.

1. మామిడిచెట్టు : ఊపిరితిత్తుల వ్యాధులకు.
2. అర్జునచెట్టు : గుండె సమస్యలకు.
3. వేపచెట్టు : సుగర్వ్యాధులకు.
4. గానుగచెట్టు : చర్మవ్యాధులకు.
5. మర్రిచెట్టు(బన్యన్) : మానసిక ఆందోళన మరియు నిద్రలేమీని దూరం చేయును.
6. పనస మరియు గుమ్మడి చెట్టు : సంతానం మరియు బలం చేకూర్చబడును.
7. మామిడి మరియు ములగచెట్టు : వాతం తగ్గించబడును.
8. బొప్పాయిచెట్టు : రోగ నిరోదక శక్తిని పెంపొందించబడును.
9. కొండ రావిచెట్టు (బర్చ) : జ్వరం మరియు ఒళ్ళు నొప్పులును తగ్గించును.
10. దేవదారు చెట్టు(పైన్) : మానసిక ఆందోళన మరియు ఒత్తిడిని దూరం చేయును.
11. అరటి చెట్టు : వెన్నుపూసకు బలం చేకూర్చబడును
12. తులసి చెట్టు : రోగ నిరొధక శక్తిని పెంచబడును మరియు చర్మవ్యాదులను నసింపచేయును
14. వెలగ చెట్టు : జ్ణాపక శక్తిని పెంచబడును మరియు సుగర్వ్యాధిని తగ్గించబడును.
15. కసివింద(అకేషియ)చెట్టు: సంతానమునుఇచ్చును.
16. సింధూర(ఓక్)చెట్టు : శక్తి, ఆయువును ఇచ్చును.
17. పెన్నెరు(చర్రీ)చెట్టు : సంతానము మరియు మంచి గుణములు ఇచ్చును.
18. బాదం చెట్టు : దిస్టికి విరుగుడు మరియు మానసిక శక్తిని ఇచ్చును.
19. సరుగుడు(ఆస్పన్)చెట్టు : ఉన్మాదమును తగ్గించును.
20. పచ్చగడ్డి : రోగ నిరొధక శక్తిని పెంచబడును మరియు రక్తప్రసారణ పెంచబడును.

Programme Co-Ordinator:
Dr. S. రామ సుబ్రహ్మణ్యం
నాడీపతి - హైదరాబాద్.
040 65459111, 8885011324 / 9490890124 

Founder & Chairman of Nadipathy.
Dr. P. కృష్ణం రాజు
నాడీపతి - కాకినాడ.
0884 6459111 / 8885011325 / 9491023456.

Email: nadipathy@gmail.com   Website: www.nadipathy.in


Comments

Popular posts from this blog

A world record has been set on 9th Dec 2015 by Team Nadipathy Research Foundation.

Nadipathy’s Traditional Tribal Therapies @ Maredumilli - E.G (A.P)